Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 27, 2026Short Read
చిలకలూరిపేటలో ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ బస్సు..
ప్రకాశం జిల్లా కొండ మంజులూరు నుంచి వేలూరు వెళ్తున్న ఆటోను ఢీకొట్టినట్లు సమాచారం.
ప్రమాదం ధాటికి ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
మృతులను చిలకలూరిపేట మండలం వేలూరుకు చెందిన బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, సువార్తమ్మగా పోలీసులు గుర్తించారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





